UPDATED 24th MARCH 2018 SATURDAY 10:00 PM
సామర్లకోట: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ కె. లక్ష్మి క్షయవ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెండు వారాల పైబడి దగ్గు, జ్వరం, రక్తం పడటం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే కళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా 12 మంది వ్యాధిగ్రస్తులకు న్యూటీషియన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిబి సూపర్ వైజర్ పి. సుబ్బారావు, వై.ఆర్.ఎల్. రావు, సిబ్బంది పాల్గొన్నారు.







