12 రకాల ఫలాలతో మరిడమ్మ అమ్మవారి అలంకరణ

UPDATED 18th JULY 2020 SATURDAY 6:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): భక్తుల పాలిట కొంగు బంగారంలా విరాజిల్లుతున్న పెద్దాపురం పట్టణంలోని మరిడమ్మ దేవస్థానంలో ఆషాడ మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని 12 రకాల ఫలాలతో శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ వేద పండితుల పవిత్ర మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిమిత సంఖ్యలో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us