UPDATED 14th SEPTEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక మఠం సెంటర్ వాటర్ ప్లాంట్ సమీపంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి గోడ కూలి 50 సంవత్సరాలు వయస్సు గల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి నిమ్మ నాగేశ్వరరావుగా గుర్తించారు. శిధిలమైన గోడను తొలగించి పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమించి బాధితుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ సమయంలో సుమారు గంటసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.







