ఆదిత్యలో వెబ్ డెవలప్ మెంట్ పై వర్క్ షాప్

UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రోగ్రెసివ్ వెబ్ డెవలప్ మెంట్ పై మూడురోజుల వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు శుక్రవారం తెలిపారు. విద్యార్థులు ఈ టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా వెబ్ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పొందవచ్చన్నారు. రిసోర్స్ పర్సన్ శశిధర్ బృందం సెనెక్స్, బెంగళూర్ నుంచి వచ్చిన ప్రతినిధులు విద్యార్థులకు సెషన్లో శిక్షణ ఇచ్చి, వెబ్ పెజీల అభివృద్ధిలో కేస్ స్టడీస్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, విభాగాధిపతులు ఎం. అనిల్ కుమార్, ఆర్.వి.వి.ఎన్. భీమారావు, వర్క్ షాప్ సమన్వయ కర్త ఎస్.ఎస్.వి.వి.ఎస్.ఎన్. మూర్తి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us