UPDATED 27th DECEMBER 2017 WEDNESDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు ఎంపికైనట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 21 వరకు తమ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో విజేతలైన తమ విద్యార్థులు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ నెల 28 నుంచి 30 వ తేదీ వరకు జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వాలీబాల్, కబడ్డీ, బాడ్మింటన్ టీములుతో పాటు 100 మీటర్ల పరుగుపందెంలో కె. అప్పారావు, 200 మీటర్ల పరుగుపందెంలో డి.ఎన్.ఎల్. వరప్రసాద్, 800, 1500 మీటర్లు పరుగుపందెంలో సత్యనరేంద్రబాబు, డిస్కస్ త్రో లో కె. మణిరామ్ ఎంపికయ్యారన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్.కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఏ. మాధవరావు, తదితరులు విద్యార్థులను అభినందించారు.







