గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థికి ప్రతిభా అవార్డు

UPDATED 27th JUNE 2018 WEDNESDAY 9:00 PM

రాజానగరం: తమ కళాశాల విద్యార్థి కోటమశెట్టి .ఎ. వెంకట్ శివకుమార్ ప్రభుత్వ ప్రతిభ అవార్డుకు ఎంపికైనట్లు గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శివకుమార్ 2013 -17 బ్యాచ్ లో ఇసిఇ విభాగంలో బిటెక్ పూర్తిచేశాడన్నారు. శివకుమార్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిభ అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ పురస్కారం క్రింద విద్యార్థి శివకుమార్ కు నగదు పారితోషకంతో పాటు ప్రశంసాపత్రం, పథకాన్ని ప్రధానం చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు (చైతన్య రాజు), గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మి శశివర్మ, సిఇవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు అభినందించారు.           

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us