UPDATED 29th OCTOBER 2019 TUESDAY 6:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐఈఈఈ (వైజాగ్) చాప్టర్ ఆధ్వర్యంలో సిగ్నల్ ప్రోసెసింగ్ మెథడ్స్ ఫర్ వైర్ లైన్స్ ఛానల్ మోడలింగ్ బై డ్రోన్-గ్రౌండ్ కమ్యూనికేషన్ లింక్స్ అనే అంశంపై అవగాహనా సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ ఈసీఈ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు)కు చెందిన కె.వి.ఎస్. హరి వక్తగా వ్యవహరించగా, ఐఈఈఈ వైజాగ్ బే సబ్ సెక్షన్ ఛైర్ కె.వి. శ్రీరామ్, వైస్ చైర్ డాక్టర్ టి.ఎస్.ఎన్. మూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.వి.ఎస్. హరి మాట్లాడుతూ వైర్ లెస్ కమ్యూనికేషన్స్ లో డ్రోన్ టెక్నాలజీ, వై ఫై టెక్నాలజీలకు సంబంధించిన నూతన పోకడలు గురించి తెలియచేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియచేస్తూ కళాశాల జ్ఞాపికలను అందచేశారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాథబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ డి. నగేష్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







