హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

UPDATED 5th JANUARY 2018 FRIDAY 11:30 PM

నర్సీపట్నం: విశాఖపట్టణం జిల్లా మాకవరపాలెం సర్పానది వంతెన సమీపంలో రాష్ట్ర హోంమంత్రికి తృటిలో ప్రమాదం తప్పింది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ జిల్లాకు బయలుదేరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయ్‌లోని ఎస్కార్ట్  జీపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జీపు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది కిందకు దిగారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరుగకపోవడంతో చినరాజప్పతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, చినరాజప్పతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us