UPDATED 16th SEPTEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: దవులూరి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఆరవ వార్డు కోలావారి వీధిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ట్రస్ట్ చైర్మన్ దవులూరి దొరబాబు, సుబ్బారావు ప్రారంభించారు. కాకినాడ డైట్ హోర్మోనే ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్ బీమాల పర్యవేక్షణలో సుమారు 300 మందికి థైరాయిడ్, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి. గణపతి, అయ్యప్ప, రాంజీ, విజయ్, రవితేజ, సురేష్, ఆకుల సూర్యనారాయణ, రాజేష్ మాస్టార్, మట్టపర్తి రామకృష్ణ, దవులూరి నాగేశ్వరరావు, జె. పద్మరాజు, తలాటం వీరప్రసాద్, తలాటం నాని, తదితరులు పాల్గొన్నారు.







