గ్రామ వాలంటీర్ల నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి

UPDATED 23rd JULY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: గ్రామ వాలంటీర్ల నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. రాము పేర్కొన్నారు. పట్టణంలో స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పసుపులేటి వీరబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. రాము ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్రామ వాలంటీర్ల నియామకాలను నిబంధనలకు అనుగుణంగా, రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జి. మిల్కీ, బి. గోపాల్, బి. భాను, వై. రమేష్, బి. శ్రీను, మహేష్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us