లిఫ్ట్ ఇస్తామని దోచేశారు

* పోలీసుల అదుపులో ఘరానా ముఠా
* నలుగురు అరెస్ట్

UPDATED 5th DECEMBER 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణంలో రాత్రి సమయంలో ప్రయాణికులకు లిఫ్ట్ ఇస్తామంటూ దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను స్థానిక పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్దాపురం సిఐ వి. శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం గత కొంతకాలంగా లిఫ్ట్ ఇస్తామని ప్రయాణికులను మోసం చేస్తూ వారి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు లాక్కొని పరారవుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ నేపథ్యంలో స్థానిక గోలివారి వీధిలో బంగారం అమ్మడానికి నలుగురు యువకులు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని అన్నారు. రాజమహేంద్రవరం ఆటోనగర్ కు చెందిన కోమలి గాంధీ, తాళ్లరేవు మండలం కోనేరు గ్రామానికి చెందిన దాసరి నాగరాజు, శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన జెట్టిపోతుల సతీష్, తాళ్లరేవు మండలం నీలపల్లికి చెందిన గుబ్బల శివశంకర్ లను అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో వివిధ పోలీస్ స్టేషన్లు పరిధిలో పలు దొంగతనాలు చేసినట్లు వారు అంగీకరించారని అన్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక ఆటో, రెండు మోటారు సైకిళ్ళు, మూడు కాసుల బంగారు గొలుసు, ఒక వెండి ఉంగరం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో క్రైమ్ ఎస్ఐ కె.వి. సూర్యనారాయణ, ఏఎస్ఐ కృష్ణ, గంగిరెడ్డి, బలరాం, నాగరాజు, రాధాకృష్ణ, శ్రీరాములు, సామర్లకోట ఎస్ఐ వి.ఎల్ వి.కె. సుమంత్, తదితరులు పాల్గొన్నారు. ఈ కేసును చేధించినందుకు సిబ్బందిని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us