UPDATED 1st JUNE 2018 FRIDAY 6:30 PM
మండపేట: పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా మండపేట నియోజకవర్గంలో 2014 నుంచి ఇప్పటివరకు 10042 శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ జిల్లా కో-ఆర్డీనేటర్ డాక్టర్ వి. వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు నియోజకవర్గంలో నిర్వహించిన వైద్య సేవల విలువ రూ. 26.7 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావును స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలుసుకుని వైద్య సేవలకు సంబందించిన పూర్తి వివరాలను పుస్తక రూపంలో ఆయనకు అందచేశారు. అలాగే వైద్యసేవ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలను ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో డీటీఎల్ బి. నరేష్ కుమార్, వైద్యమిత్రలు వి. కళ్యాణి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







