రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నీస్ పోటీల్లో శ్రీప్రకాష్ విద్యార్ధుల ప్రతిభ

UPDATED 21st DECEMBER 2020 MONDAY 5:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టేబుల్ టెన్నీస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్- 2020 పోటీల్లో స్థానిక రామారావుపేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి విజయ దుందుభి మోగించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఈ పోటీల్లో సబ్- జూనియర్స్ విభాగంలో 10వ తరగతి విద్యార్థి వెంకట మహపతి రామ్ సంజయ్ ప్రథమ స్థానంలో నిలిచి ఏపి స్టేట్ టేబుల్ టెన్నీస్ ఛాంపియషిప్ కైవసం చేసుకోగా, అండర్- 12 విభాగంలో ఏడవ తరగతి విద్యార్థిని జి. సిరి పావని ప్రథమ స్థానంలో నిలిచింది. 11వ తరగతి విద్యార్థి టి. సూర్యతేజ యూత్ విభాగంలో ప్రథమ స్థానంతో పాటు, జూనియర్, మెన్స్ విభాగాల్లో కాంస్య పతకం కైవసం చేసుకోగా,12వ తరగతి విద్యార్థి సిహెచ్ నితీష్ సాయివర్మ యూత్ రన్నరప్ గా నిలిచినట్లు శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ డైరెక్టర్ సి.హెచ్. విజయప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల డైరెక్టర్ విజయ ప్రకాష్, అకడమిక్, కల్చరల్ కో- ఆర్డినేటర్లు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర  సిబ్బంది, తదితరులు అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us