స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన ఆర్డీవో

UPDATED 25th OCTOBER 2017 WEDNESDAY 5:30 PM

పెద్దాపురం :జిల్లా కలక్టర్ ఆదేశానుసారం పెద్దాపురం పట్టణంలో ఉన్న స్కానింగ్ సెంటర్లను ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు బుధవారం తనిఖీ చేశారు. దీనిలో భాగంగా స్థానిక లక్ష్మి నర్సింగ్ హోమ్ ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ విషయాలను గోప్యంగా ఉంచాలన్నారు. స్కానింగ్ రిపోర్టులను, డీఐవో పరిశీలించారు. అలాగే స్కానింగ్ సెంటర్లపై ఫిర్యాదులు వస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఇమ్యూనైజేషన్ అధికారి మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us