తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

-జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా  

UPDATED 3rd AUGUST 2017 THURSDAY 7:00 PM

కాకినాడ : బిడ్డ ఆరోగ్యానికి తల్లి పాలే శ్రేయస్కరమని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. స్థానిక కలెక్టరేట్‌ విధాన గౌతమి హాల్లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ పీడీ శారదాదేవి అధ్యక్షత జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ క్రమం తప్పకుండా బిడ్డకు తల్లిపాలు అందించడం ద్వారా ఆరోగ్యంగా తీర్చిదిద్ద వచ్చునన్నారు. ఆసుపత్రిలో ప్రసవాలు ద్వారా తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలని, ఆసుపత్రి ప్రసవాలతో ఇది సాధ్యమౌతుందన్నారు. జిల్లాలో 39,657 మంది గర్భిణులు, 33,184 మంది బాలింతలు ఉన్నారని, వీరి ఆరోగ్య పరిరక్షణకు వైద్య, ఆరోగ్యశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తల్లులు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వీటిని అందిస్తు న్నామన్నారు. ఆసుపత్రిలో ప్రసవాలు చేసుకున్న వారిని ఇంటికి సురక్షితంగా పంపటానికి ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, పౌష్టికాహార కిట్లు కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ రురల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ బిడ్డకు రెండేళ్ల వరకూ తల్లులు పాలివ్వాలని, ఆరు నెలలు దాటిన తరువాత బిడ్డకు ఆహారం అందించవచ్చునన్నారు. తక్కువ వయసులో వివాహాలు చేసుకున్నవారిలో పౌష్టికాహార లోపం ఉంటోందని, వివాహ వయసు వచ్చిన తరువాతే వివాహాలు జరిగేలా ప్రచారం చేపట్టాలన్నారు. ఈ  సమావేశంలో జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, ట్రైనీ కలెక్టర్‌ ఆనంద్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ చంద్రయ్య, యునిసెఫ్‌ స్టేట్ కోఆర్డినేటర్ సుహాసిని, జిఎంఆర్ ప్రతినిధి సుధాకర్, జిల్లా శిశు సంరక్షణాధికారి సి.హెచ్.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us