నవరత్నాలతో అందరికీ మేలు

UPDATED 31st JANUARY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతీ కుటుంబం ఆనందంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గణపతినగరం 29వ వార్డులో గురువారం సాయంత్రం పార్టీ నాయకులు వసంతుల ప్రసాద్, కానూరి శ్రీను ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా దొరబాబు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి మోసగించింది చాలని ఇక ప్రజలు మీ వాగ్దానాలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతీ  ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి (దొరబాబు), కాళ్ల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజస్, సేపేని సురేష్, మద్దాల శ్రీను,సంగినీడి భావనారాయణ, దవులూరి సుబ్బారావు, కానుబోయిన విజయకృష్ణ, పుట్టా సూరిబాబు, డేగల విజయభాస్కర్, పితాని కృష్ణ, జుత్తుక అప్పారావు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us