ఉత్సాహంగా సాగిన ఫార్మసీ జాతీయస్థాయి సదస్సు

UPDATD 24th NOVEMBER 2018 SATURDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఫార్మసీ వారోత్సవాలలో భాగంగా ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఫార్మసీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ ఫార్మసీ  గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సహకారంతో భవిష్యత్తులో మోడరన్ టెక్నాలజీస్ ఇన్ డ్రగ్ డిజైన్ డవలప్ మెంట్ అండ్ ఎవాల్యూయేషన్ అనే అంశంపై రెండురోజుల జాతీయస్థాయి సదస్సు ఉత్సాహంగా సాగింది. వివిధ కళాశాలల నుంచి హాజరైన నిష్ణాతులైన ప్రొఫెసర్ల పర్యవేక్షణలో విద్యార్థులు సమర్పించిన పేపర్,పోస్టర్ ప్రజంటేషన్స్, పజిల్స్, ట్రెజర్ హంట్ గేమ్స్ తదితర అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పార్టిసిఫేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆఫ్రికా దేశానికి చెందిన ఆదిత్య ఫార్మసీ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు, ఫుడ్, గేమింగ్ స్టాల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్, ఆదిత్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ వై. సురేంద్రనాధరెడ్డి, డాక్టర్ కె. దివాకర్, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ డి. సతీష్, వివిధ ప్రాంతాలకు చెందిన 50 ఫార్మసీ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు  పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us