విత్తనశుద్ధితో అధిక దిగుబడులు

UPDATED 4th JUNE 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: విత్తనశుద్ధి చేపట్టడం ద్వారా పంటలు తెగుళ్ల బారిన పడకుండా అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి ఎన్. శ్యామూల్ జాన్ అన్నారు. సామర్లకోట మండలం నవర గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు విత్తనోత్పత్తి, విత్తనశుద్ధి, తొలకరి వరిసాగుపై మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ బి. నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి శ్యామూల్ జాన్ మాట్లాడుతూ రైతులు మేలు జాతి విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేపట్టడం ద్వారా వరి సాగులో వచ్చే మాగుడు, అగ్గి తెగుళ్లకు అరికట్టవచ్చని తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని, మరిన్ని సేవల కోసం టోల్ ఫ్రీ నెంబరు 18004198800 సంప్రదించాలని ప్రాజెక్టు మేనేజర్ నాగేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రోగ్రామ్ పర్సన్లు బి. శ్రీనివాసు, యు. రమేష్, రైతు నాయకులు వెన్నా నాగేశ్వరరావు, తోట సూరిబాబు, బండే శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us