పరిశ్రమలు, విద్యాసంస్థలకు మధ్య వారధిగా ఫ్యాకల్టీ విభాగం

UPDATED 4th JULY 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: పరిశ్రమలు, విద్యాసంస్థలకు మధ్య వారధిగా ఫ్యాకల్టీ విభాగం పనిచేస్తుందని అనంతపురం జె.ఎన్.టి. యు మాజీ వైస్ ఛాన్సలర్, ఐ.ఎస్.టి.ఇ ఆంద్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ లాల్ కిషోర్, హైదరాబాద్ కె.ఎల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ అతుల్ ఉడిపి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ విభాగము ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాకల్టీ విభాగము పరిశ్రమలకు సంబంధించిన భవిష్యత్ అవసరాలను తీర్చే నైపుణ్యాలను అందిస్తుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  టి.కె. రామకృష్ణారావు ఈ సొసైటీ ప్రాధాన్యత గురించి అధ్యాపకులు, విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. రామకృష్ణ, వివిధ వివిభాగాల అధిపతులు ఎం. అనిల్ కుమార్, ఆర్.వి.వి.ఎస్. భీమారావు, సి.హెచ్. మూర్తి, బి. మాణిక్యాలరావు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us