ప్రజల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 4th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా సమస్యలు అధిగమించి సంక్షేమ పథకాల అమల్లో రాజీ లేకుండా ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా టిడిపి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలంలోని ఉండూరు గ్రామంలో సోమవారం జరిగిన ‘పసుపు-కుంకుమ’ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు, రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్ లో ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు ఆదాయం చేకూర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాలోచనలు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో నూరుశాతం మౌలిక వసతులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం పసుపు-కుంకుమ క్రింద 135 సంఘాలకు రూ.కోటి 36 లక్షల చెక్కులను 678 మంది పింఛన్ దారులకు రూ.20 లక్షల 63 వేల 500లు నగదును, చంద్రన్న పెళ్లికానుక క్రింద ఐదు జంటలకు రూ.2 లక్షల 15 వేల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం బోయినపూడి నుంచి కాపవరం వరకు 12కి.మీ. రోడ్డుకు రూ.3 కోట్ల 10 లక్షలతో ప్రత్యేక మరమత్తుల నిమిత్తం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కె. సత్యనారాయణ, ఎంపిడిఓ కె. స్వప్న, మండల ప్రత్యేక అధికారి రాజశేఖర్, ఈవోపిఆర్డీ సిహెచ్ జగ్గారావు, ఏపిఎం జగదీశ్వరి, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us