కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: జిల్లాలో పలు సచివాలయాల్లో 15 ఆశా కార్యకర్తల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా.గౌరీశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 2 నుంచి 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, సంబంధిత యూపీహెచ్‌లో దరఖాస్తులు తీసుకుని అదే మెడికల్ అధికారికి స్వయంగా అందజేయాలన్నారు. తప్పనిసరిగా మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత సచివాలయాల్లో నివాసం ఉంటూ 25 నుంచి 45 మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 6, 96, 97, 101 డివిజన్లలో 4 ఖాళీలు, తుని మున్సిపాలిటీలోని 7, 11 13 14 వార్డుల్లో 4, అమలాపురం మున్సిపాలిటీలోని 4, 11, 7 వార్డుల్లో 3, సామర్లకోటలోని 6, 15 వార్డుల్లో 2, పిఠాపురంలోని 15వ వార్డులో ఒకటి, మండపేటలోని 13వ వార్డులో ఒక పోస్టు ఉన్నాయని వివరించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







