UPDATED 17th SEPTEMBER 2018 MONDAY 6:00 PM
మండపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆదేశాల మేరకు స్థానిక ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆధ్వర్యంలో స్థానిక బిక్కిన నర్సింగ్ హోమ్ సహకారంతో సోమవారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ శిబిరంలో సుమారు 170 మందికి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందచేశారు. అలాగే శిబిరంలో డాక్టర్ దాసరి అవినాష్ వైద్య సేవలను అందించారు. అనంతరం ఎన్టీఆర్ వైద్య సేవ డీటీఎల్ బండారు నరేష్ మాట్లాడుతూ జిల్లా సమన్వయాధికారి డాక్టర్ వరప్రసాద్ ఆదేశానుసారం ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రస్తుతం వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల కారణంగా డెంగ్యూ, విష జ్వరాలు మొదలయిన వ్యాధులు విజృంభిస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాంకో బి. శ్రీనివాస్, వైద్య మిత్ర వి. కళ్యాణి, బిక్కిన నర్సింగ్ హోమ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







