త్వ‌ర‌లో కొత్త రూ. 50 నోట్లు

UPDATED 18th AUGUST 2017 FRIDAY 7:00 PM

నోట్ల ర‌ద్దు అనంతరం కొత్త‌గా రూ. 500, 2000 నోట్ల‌ను కేంద్రం ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. పాత 500, 1000 నోట్ల‌ను బ్యాన్ చేసిన ప్ర‌భుత్వం.. రూ. 5, 10, 50, 100 నోట్ల‌ను మార్చ‌లేదు. అవి అలాగే చ‌లామ‌ణిలో ఉన్నాయి. అయితే.. ఇప్పుడు కొత్త రూ. 50 నోటుకు సంబంధించిన నమూనాను కూడా విడుద‌ల చేసింది ఆర్బీఐ. అచ్చు కొత్త రూ. 500 నోటులా ఉండే ఈ నోటు వెన‌క భాగంలో మాత్రం దేశ సాంస్కృతిక వార‌స‌త్వం ఉట్టిప‌డేలా హంపీ ర‌థాన్ని చేర్చింది. కొత్త రూ. 500 నోటు వెన‌క భాగంలో ఎర్ర కోట ఉంటే రూ. 50 నోటు పై హంపీ ర‌థాన్ని చేర్చి దేశ చారిత్ర‌క సంప‌ద‌ను దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసేనా వినూత్నంగా ఆలోచించింది ఆర్బీఐ. అయితే.. రూ. 50 కొత్త నోటును ఆర్బీఐ ఎప్పుడు రిలీజ్ చేస్తుంద‌నే విష‌యాలు మాత్రం ఇంకా తెలియ‌రాలేదు. కొత్త రూ. 50 నోట్లు చ‌లామ‌ణిలోకి వ‌చ్చినప్ప‌టికీ.. పాత రూ. 50 నోట్లు రద్దు కావని, పాతవి కూడా చ‌లామ‌ణిలో ఉంటాయ‌ని ఆర్బీఐ పేర్కొంది .

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us