ఆదిత్యలో ముగిసిన అధ్యాపక అభివృద్ధి శిక్షణ

UPDATED 30th MAY 2018 WEDNESDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ విభాగంలో అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి గత మూడు రోజులుగా ముఖ్యతిథిగా పాల్గొన్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి చెందిన మేనేజ్ మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎన్. ఉదయ భాస్కర్ నూతన బోధనా పద్ధతులు సాహిత్య సమీక్ష, ప్రభావం బోధన వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా అధ్యాపకులకు బోధించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ బోధనా పద్ధతులను మార్చుకోవాలని, అలాగే నూతన పద్దతులను పుణికి పుచ్చుకుని విద్యార్థులకు అవసరమయ్యే పద్దతుల ద్వారా బోధించి వాటి ద్వారా విద్యార్థులను విజేతలుగా తయారుచేయవచ్చని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలక్ష్మి మాట్లాడుతూ అధ్యాపకులు తమ బోధనా పద్దతులలో సందర్భ పరిశీలన, కార్యశాలలు, సదస్సులు ద్వారా విద్యను బోధించడం ద్వారా విద్యార్థులు సులభంగా పాఠాలను అవగాహన చేసుకుని వాటిని పరీక్షల సమయంలో అన్వయించడం ద్వారా వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులుగా విజయాలు సాధించవచ్చని సూచించారు.  ఈ కార్యక్రమంలో కళాశాల భోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us