UPDATED 3rd APRIL 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: ఎస్సీ ఎస్టీల రక్షణకు ఉన్న అట్రాసిటీ చట్టానికి ప్రతికూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి రొక్కం శ్యాం దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో మంగళవారం మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దళితులకు రక్షణ కవచం లాంటిదని, సుప్రీంకోర్టు ఇటీవల తీరు దళితుల హక్కులను హరించే విధంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా దళితులను అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అగ్రవర్ణాలు, పెత్తందారుల దాడుల నుంచి కాపాడుకోవడానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు రక్షణ కవచంలా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా సెక్రటరీ నేతల హరిబాబు, జిల్లా యూత్ ప్రెసిడెంట్ వజ్రపు వీరేష్, జిల్లా జాయింట్ సెక్రెటరీ బోను దేవ, కుంచే జగన్, లోడ సరస్వతిరావు, తదితరులు పాల్గొన్నారు.







