గణిత మేధావి రామానుజన్‌

UPDATED 22nd DECEMBER 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : ప్రతిభకు పేదరికం, భాష, ప్రాంతం అడ్డురావని, ఆసక్తి ఉంటే కోరుకొన్న రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని శ్రీనివాస రామానుజన్ నిరూపించారని ప్రముఖ గణిత అవధాని , జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 133వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాయిరామకృష్ణ మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన రామానుజన్ ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.హెచ్.హార్డీ  అభిప్రాయంలో తను చేసిన  అత్యుత్తమ గణితసేవలో రామానుజన్ లోని ప్రతిభను గుర్తించడమేనని పేర్కొనడాన్ని బట్టి ఆయన మేధస్సును అవగాహన చేసుకోవచ్చన్నారు. రామానుజన్ తార్కిక శక్తి, తపన, పట్టుదల, నిరాడంబరత నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల లోని ఆసక్తిని గమనించి  ప్రోత్సహించడం ద్వారా మరెందరో రామానుజన్ లను సమాజానికి అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. 32 ఏళ్ల అతి తక్కువ కాలంలోనే రామానుజన్ అద్భుత గణిత కృషి భారతీయుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీలం అర్జున్ కుమార్, చిట్టిబాబు, కాశీ విశ్వనాథం, పలువురు విద్యార్థులు వేజిత్, వేహిత, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us