భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకోవాలి

UPDATED 14th MARCH 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ కంఠం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొని బుధవారం మాట్లాడారు. నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు 10 జిపిఎ ఎక్కువ మంది విద్యార్థులు సాధించాలని ఆకాక్షించారు. ఉత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి పేరు తేవాలని విద్యార్దులకు సూచించారు. విద్యార్థులకు సంజయ్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఎన్.సి.సి ఆఫీసర్ జి.వి.వి. సత్యనారాయణ పరీక్షలకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, అట్టలను 138 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి.హెచ్. సత్యవతి, ఎం. శ్రీనివాసరావు, ఉమా మహేశ్వరరావు, మూర్తి రాజు, నరేష్, సుశీల, జయలక్ష్మి, రాధామాధవి, వైజయంతి, సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us