ప్రగతిలో మెటల్ కటింగ్ & మెషినింగ్ అంశంపై అవగాహన

UPDATED 21st JUNE 2019 FRIDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “మెటల్ కటింగ్ & మెషినింగ్" అనే అంశంపై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిట్ (వరంగల్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మూడవ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు మెటల్ కటింగ్, మిషనింగ్ సైన్స్, నూతనంగా ఏర్పడిన మెషినింగ్ మెళకువలు, తదితర అంశాలపై అవగాహన కలుగచేశారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయడానికి, తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా మెకానికల్ విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శంభూ ప్రసాద్, మెకానికల్ ఇంజనీరింగ్  విభాగాధిపతి డాక్టర్ బి.ఎస్.వి. రామారావు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us