UPDATED 21st JUNE 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ యోగా మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో అవసరమని, యోగాసనాలను జీవితంలో దినచర్యగా పాటించి ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ యోగా నేటి ఒత్తిడి జీవితంలో విద్యార్థులు, అధ్యాపకులకు సైన్ థెరపీగా పనిచేస్తుందని, వారి నైపుణ్యాన్ని రెండింతలుగా మెరుగుపరుచుకోవచ్చు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు యోగాసనాలు వేసారు. ఈ కార్యక్రమం ఎన్.సి.సి ఆఫీసర్ జె.డి. నాయుడు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ పి. రాజశేఖర ఫణీంద్ర, బి. ఆదినారాయణ, ఫిజికల్ డైరక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎమ్.వి. హరనాధ్ బాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురామ్, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ అర్ అండ్ డి డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, వివిధ విభాగాధిపతులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







