UPDATED 26th JANUARY 2020 SUNDAY 8:00 PM
రాజానగరం(రెడ్ బీ న్యూస్): ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడటంతో రాజ్యాంగ స్ఫూర్తి, బలం గొప్పవని కళాశాల డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి పేర్కొన్నారు. 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా కళాశాల డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి సంయుక్తంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా లభించినపుడే రాజ్యాంగ లక్ష్యం, అర్థం నెరవేరతాయని అన్నారు. భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పదని, ఎందరో మహనీయుల త్యాగ ఫలాలు అందులో ఉన్నాయని పేర్కొన్నారు. నాటి మహానుభావుల త్యాగాలు స్ఫూర్తిగా మనం శ్రమించాల్సిన అవసరం ఉందని, ఎందరో త్యాగాల ఫలంగా స్వేచ్ఛగా జీవిస్తున్నామనే విషయాన్ని మనం మరువరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







