గోకవరంలో జియో డిజిటల్ షాపింగ్ మాల్ ప్రారంభం

గోకవరం,30 ఆగస్టు 2020(రెడ్ బీ న్యూస్): మార్కెట్ ధరల కంటే అతి తక్కువ ధరలో జియో డిజిటల్ షాపింగ్ మాల్ లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు లభ్యమవుతాయని రాజబాబు నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ రాజబాబు అన్నారు. మండల కేంద్రమైన గోకవరంలో జియో డిజిటల్ ఏర్పాటుచేసిన జియో డిజిటల్ షాపింగ్ మాల్ ను ఆయన ఆదివారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి కొనుగోలు ఆయన వినియోగదారుడికి ఆయన చేతులమీదుగా అందజేశారు. అలాగే షాపింగ్ మాల్ లో లభ్యమయ్యే ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఆయన పరిశీలించారు. జియో బ్రాంచ్ మేనేజర్ చైతన్య మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ పరికరాల కోసం రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరానికి వెళ్లకుండానే అక్కడ కంటే ఇక్కడ తక్కువ ధరకు అందించడం జరుగుతుందన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రూ. వెయ్యి రూపాయలు కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి ఆకర్షణీయమైన బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గోకవరం పరిసర ప్రాంత వాసులే కాకుండా కోరుకొండ, రంపచోడవరం, గంగవరం, దేవీపట్నం మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ముందుగా షాపింగ్ మాల్ డాక్టర్ రాజబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జియో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us