UPDATED 24th JANUARY 2019 THURSDAY 5:30 PM
గండేపల్లి: బాలికలు సమయాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో మెలుగుతూ లక్ష్యాలను అధిగమించాలని ప్రిన్సిపాల్ ఇ. మోహన్ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం జనవరి 24న బాలికల రక్షణ, గౌరవం, మహిళా సాధికారత కోసం జాతీయ స్థాయిలో జరుపుకుంటారని, దేశంలో ఉన్న బాలికలకు మరింత మద్దత్తు, నూతన అవకాశాలను అందించడానికి ప్రారంభమైందని తెలిపారు. బాలికలు చదువుపై శ్రద్ధ వహించాలని, సెల్ ఫోన్, ఇంటర్ నెట్, ధారావాహికలకు దాసోహం కాకూడదన్నారు. తద్వారా మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. మహిళలకు వన్నెతెచ్నిన ఇంధిరాగాంధీ, మదర్ థెరీసా, కిరణ్ బేడీ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సంవత్సర జాతీయ బాలికల దినోత్సవం థీమ్ "ఒక ప్రకాశవంతమైన రేపు కోసం మహిళలను సాధికారమివ్వడం" అని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి. ప్రవీణ్, విద్యార్థులు చర్చలో తెలిపారు.







