* డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి
* ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవం
UPDATED 9th MARCH 2020 MONDAY 8:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తేనే దేశాభివృద్ధి సాధిస్తుందని ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మహిళాభ్యుదయం కోసం ప్రభుత్వాలు, సంస్థలు ఎన్నో రాయితీలు కల్పిస్తూ శిక్షణ ఇస్తూ మహిళల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళ అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాలలో వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న మహిళలకు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే విద్యార్థినులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ, కోఆర్డినేటర్ కృష్ణ సౌజన్య, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







