పుస్తక పఠనంతో విజ్ఞానం

UPDATED 15th NOVEMBER 2019 FRIDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): పుస్తక పఠనం ద్వారానే విజ్ఞానం అభివృద్ధి చెందుతుందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ, యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల  హెచ్ఎం యు. సత్యనారాయణ అన్నారు. 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గ్రంధాలయాధికారి ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామర్లకోట శాఖా గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన సాయిరామకృష్ణ, సత్యనారాయణలు మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల మేధాశక్తి పెరగటానికి అవకాశం ఉంటుందని, నైపుణ్యాలను పెంచుకోవటానికి ప్రతీ ఒక్కరికి పుస్తకం హస్తభూషణం కావాలన్నారు. సినిమాలు, ఛాటింగ్ వంటి వాటితో సమయాన్ని వృథా చేయకుండా పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని అన్నారు. గ్రంధాలయాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ సామర్లకోట శాఖా గ్రంథాలయంలో సుమారు 18 వేలు వరకు వివిధ రకాలైన పుస్తకాలతో పాటు అన్ని రకాల  పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, పాఠకులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యుఎల్ బి కోఆర్డినేటర్ కె. శేఖర్, గ్రంథాలయ సిబ్బంది ఎస్. బుల్లియ్య,  విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us