బస్సు నుంచి జారి వ్యక్తి మృతి

UPDATED 11th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా జారిపడి ఇంధన నాగు (34) అనే వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోట ఎస్ఐ విఎస్ సుమంత్ తెలిపిన వివరాల ప్రకారం ద్వారపూడి నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా బస్సు కదలడంతో జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. సంఘటన ప్రాంతాన్ని ఎస్ఐ సుమంత్, ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us