ఉండూరులో జనబాట

UPDATED 10th FEBRUARY 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: మండల పరిధిలోని ఉండూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ సినీరంగంలో ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ, ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో రాజకీయరంగ ప్రవేశం చేసి జనసేన పార్టీని స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నున్న గణేష్ నాయుడు, తుమ్మల సూరిబాబు, కొప్పులవాసు, భావన్నారాయణ, వరహాలయ్య, లక్షణ దివాకర్, సరోజ్ వాసు, తుమ్మల ప్రసాద్, పెంకే వెంకటలక్ష్మి, కృష్ణవేణి, దుర్గాదేవి, ముమ్మిడి లక్ష్మణ్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us