UPDATED 28th SEPTEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామదర్శిని కార్యక్రమం సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక 11వ వార్డు భీమవరంపేట, సీతాఫలతోట ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పురపాలక సంఘంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు గురించి భాషా, సాంస్కృతిక శాఖ (రాజమండ్రి) ఎస్. చలం జానపద కళా బృందంచే జానపదాల ద్వారా అవగాహన కల్పించారు. రాబోయే కాలానికి సంబంధించి వివిధ పధకాల ద్వారా అభివృద్ధి చేయు ప్రణాళికలను తయారు చేయడానికి కావలసిన సమాచారం సేకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నోడల్ ఆఫీసరు చోడగం వెంకటేశ్వరరావు, కమీషనరు, డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీరు, రెవెన్యూ ఆఫీసరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, ఎలక్ట్రికల్, హౌసింగ్, రెవిన్యూ, హెల్త్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|







