Crime News: ఏడు రాష్ట్రాల్లో 14 మందిని పెళ్లాడిన వ్యక్తి అరెస్టు

UPDATED 15th FEBRUARY 2022 TUESDAY 07:00 AM

Married Person: జిల్లా పట్కూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మహిళను పెళ్లాడి డబ్బులతో పారిపోయాడు. ఈ మగానుభావుడికి తొలిసారి 1982లో పెళ్లి అయింది. 20ఏళ్ల తర్వాత రెండో పెళ్లి 2002లో. ఈ రెండు పెళ్లిళ్ల కారణంగా ఐదుగురు సంతానం కలిగారని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ దాస్ అన్నారు. 2002 నుంచి 2020 మధ్య కాలంలో మాట్రిమోనల్ వెబ్‌సైట్స్ ద్వారా పరిచయం పెంచుకుని ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడు.

చివరిగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఢిల్లీ స్కూల్ టీచర్ అయిన మహిళను పెళ్లాడి అక్కడే ఉంటున్నాడు. ఆమెకు తన భర్త గతంలో చేసుకున్న వివాహాల గురించి తెలిసి షాక్ అయింది. పోలీసులకు సమాచారం అందించడంతో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.మధ్య వయస్సు మహిళలనే టార్గెట్ చేసుకుని వివాహానికి ప్రయత్నించేవాడని డీసీపీ అంటున్నారు. చాలావరకూ విడాకులు తీసుకుని మాట్రిమోనల్ వెబ్‌సైట్‌లో జోడీ కోసం వెదికేవారిని వివాహమాడేవాడు.

తర్వాత వారి నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించేవాడు. డాక్టర్ గా చెప్పుకుని లాయర్లను, ఫిజిషియన్లు విద్యావంతులైన మహిళలను పెళ్లాడేవాడు. ఈ బాధితుల్లో పారా మిలిటరీ బలగాలకు చెందిన మహిళ కూడా ఉంది. ఢిల్లీ, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో మహిళలను మోసం చేశాడు. గతేడాది స్కూల్ టీచర్ మహిళా పోలీస్ కు కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను 2018లో పెళ్లాడి భువనేశ్వర్ తీసుకొచ్చాడు. ఆమెకు విషయం తెలిసి కంప్లైంట్ చేసింది. అతణ్ని అరెస్టు చేసి 11ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తానని, లోన్ ఫ్రాడ్ తదితర కంప్లైంట్స్ తో హైదరాబాద్, ఎర్నాకులం ప్రాంతాల్లో రెండు సార్లు అరెస్ట్ కూడా అయ్యాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us