UPDATED 25th NOVEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక ఆరవ వార్డులో గల ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ప్రముఖ అంతర్జాతీయ వర్తమానికులు బ్రదర్ అనిల్ కుమార్ తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పాల్గొన్నారు. అనంతరం చర్చి ప్రతినిధులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దవులూరి సుబ్బారావు, కౌన్సిలర్ ఊబా జాన్ మోజేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావుచౌదరి, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







