UPDATED 4th JANUARY 2019 FRIDAY 5:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదిత్య గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో న్యూటన్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి న్యూటన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ న్యూటన్ ఒక ఆంగ్ల, గణిత, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళవేత్త, వేదాంతి, రచయితని ఆయన సహజ తత్వవేత్తగా వర్ణించబడ్డారని అన్నారు. అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తలలో ఈయన ఒకరని, శాస్త్రీయ విప్లవంలో కీలకమైన వ్యక్తి అని పేర్కొన్నారు. విద్యార్థులు వివిధ విభాగాలలో నిష్ణాతులైన శాస్త్రవేత్తల జీవిత విశేషాలు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో క్యాంపస్ లో గల ఆయా భవనాలకు కాటన్, కెఎల్ రావు, బిల్ గ్రేట్, విశ్వేశ్వరాయ, సివి రామన్, రామానుజన్, కలాం, మొదలైన విశిష్ట వ్యక్తుల పేర్లు పెట్టడం జరిగిందని, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఇ విభాగం భవనానికి న్యూటన్ భవనంగా నామకరణం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ పి.ఎస్.వి.వి.ఎస్. కుమార్, కె. మనోజ్ కుమార్ రెడ్డి, ఎం.శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పవన్ కుమార్, గ్రంధాలయ అధికారి కె. అశోక్ కుమార్, ఎన్. సింహాచలం, కె.వి. రమణ, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







