UPDATED 4th SEPTEMBER 2017 MONDAY 7:00 PM
పెద్దాపురం: రిటైర్డ్ హెడ్ మాస్టర్ బుక్కా మరిడయ్య మృతి పట్ల సోమవారం పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆయన ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది పలు పాఠశాలలను అభివృద్ధి దిశగా కృషి చేశారు. ఈ సందర్భంగా శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ మాట్లాడుతూ ఆయన మృతి తమకు తీరని లోటని, పాఠశాలల అభివృద్ధికి ఆయన చేసిన కృషి, విద్యార్థుల పట్ల ఆయన చూపించిన ప్రేమ మరువలేనివన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో మాజీ ఎంపిటిసి సభ్యుడు మలకల సూర్యారావు, సూరిబాబు, జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ, త్రివర్ణ స్కూల్ అధినేత టి. వెంకటేశ్వరావు, డాక్టర్ వై.వి.బి. ప్రసాదరావు తదితరులు ఉన్నారు.







