ఓవరాక్షన్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవు

* సామర్లకోట ఎస్ఐ సుమంత్

UPDATED 30th DECEMBER 2019 MONDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31వ తేదీ మంగళవారం రాత్రి ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి ఇతరులకు ఇబ్బందులు కలగచేస్తే చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని సామర్లకోట ఎస్ఐ సుమంత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో సోమవారం ఆయన మాట్లాడుతూ ఎవరైనా తప్ప తాగి రోడ్లపై తిరగడం, మోటారు వాహనాలను అతి వేగంగా నడపడం, బాణాసంచా పేల్చడం, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం, రాత్రి వేళ రోడ్లపై విహరించడం తదితర ఓవరాక్షన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సాయంత్రం నుంచే పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంటుందని, మఫ్టీ పోలీసులు మోటారు సైకిళ్లపై అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి రోడ్లపైన అల్లరి చేయడం, రోడ్లపై కేకులు కట్‌ చేయడం, వాహనాలను సైలెన్సర్లు తొలగించి స్కూటర్లను నడిపినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా బయటకు వెళ్లడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటాయని, ప్రధానంగా విద్యార్థులు, యువకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటారని, వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలను రోడ్లపై వెళ్లనీయవద్దని, ఇంటిలోనే అందరూ కలిసి నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు సమర్ధవంతమైన సేవలు, భద్రత అందించడమే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us