నయనానందకరంగా సత్యదేవుని హారతి సేవ

UPDATED 15th MAY 2019 WEDNESDAY 9:00 PM

అన్నవరం: రత్నగిరివాసుడైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి హారతిసేవ నయనానందకరంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి మూలవిరాట్‌కు వేద పండితులు పవిత్ర మంత్రోచ్ఛరణల నడుమ ఓంకార, హంస, బిల్వ, నాగసర్ప, గరుడ, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు ఇచ్చారు. ఈ హరతులకు వినియోగించే వెండి సామాగ్రిని శ్రీలలితా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (పెద్దాపురం) అధినేతలు మట్టే సత్యప్రసాద్, మట్టే శ్రీనివాసులు దేవస్థానానికి అందచేశారు. ఇందులో పాల్గొనే దంపతులకు రూ.500 టికెట్టుగా నిర్ణయించారు. ప్రతీరోజు రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు హారతిసేవను నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు, దేవస్థానం సిబ్బంది, తదితరులు అభినందించారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us