UPDATED 21st OCTOBER 2019 MONDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి అల్లు వెంకట దుర్గాభవాని సోమవారం తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20 రోజులు లోగా రాజమండ్రి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని ఆమె తెలిపారు.







