UPDATED 14th JULY 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: హరితాంధ్రప్రదేశ్ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని జెడ్పీటీసి సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి అన్నారు. సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వనం-మనం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించేందుకు అన్ని ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని కోరారు. వాతావరణంలో కాలుష్య నివారణకు పచ్చని మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం జాతీయ ఉపాధి హామీ పంచాయతీ కన్వెర్జెన్సీ నిధులు రూ. 37 లక్షలతో గ్రామంలో చేపట్టనున్న డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







