సీనియర్ పాత్రికేయుడికి ఆర్ధిక సహాయం

UPDATED 26th OCTOBER 2017 THURSDAY 7:30 PM

పెద్దాపురం : పెద్దాపురం సీనియర్ జర్నలిస్ట్ బందిలి సతీష్ బాబుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు గురువారం ఆర్ధిక సాయం చేశారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సతీష్ ను సంఘ నాయకులు కలుసుకుని ఆయన   కుటుంబానికి సంఘం తరుపున రూ. ఎనిమిది వేలు ఆర్థికసాయం అందించారు. అనంతరం సంఘ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి నవీన్ రాజ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పాత్రికేయులను ఆదుకునేందుకు తమ సంఘం తరుపున సహాయ సహకారాలను అందిస్తున్నట్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి షేక్ మున్నీ, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి. అధికారి, రాజీవ్, నియోజకవర్గ అధ్యక్షుడు అలమండ రంగనాథ స్వామి(రమేష్), కార్యదర్శి కరెడ్ల తిరుపతి రాజా, గౌరవాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, రవిబాబు, సిద్ధాంతపు సుబ్బారావు, శ్రీధర్ బాబు, ఆనంద్, లక్ష్మణరావు, విజయ్, సిద్ధూ, ప్రభుదాస్, సి. హెచ్. రాజా, ఎస్.ఎల్. రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us