బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు

* ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
* ముగ్గురు పరిస్థితి విషమం

UPDATED 30th SEPTEMBER 2019 MONDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం జి మేడపాడు గ్రామంలో కెనాల్ రోడ్డు పక్కన గల వ్యవసాయ పొలంలో ఇందిరా ఫైర్ వర్క్స్ సంస్థ నిర్వహిస్తున్న బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలు పాలైన ఎనిమిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ నయీమ్ హష్మీ, పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు సిఐ శ్రీనివాసరావు, సామర్లకోట ఎస్సై సుమంత్ పరిశీలించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us