UPDATED 2nd AUGUST 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఆదిత్య గ్రంధాలయ శాఖ ఆధ్వర్యంలో భారత జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పింగళి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, భారత జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య మన రాష్ట్రంలో మచిలీపట్నం సమీపంలో భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారని, ఆయన స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా మంచి విద్యావేత్తని అయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2009లో తపాలా బిళ్ళను జారీ చేశారని అన్నారు. జాతి గుండెల్లో పింగళి స్మృతులు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు, గ్రంధాలయాధికారి కె. అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







