సాంకేతిక ఉత్సవాల్లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ

UPDATED 18th SEPTEMBER 2019 WEDNESDAY 8:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్) : గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎమ్. వీరేంద్ర, నిఖిల్ పలు కళాశాలల్లో జరిగిన సాంకేతిక ఉత్సవాలలో వివిధ విభాగాలలో పాల్గొని ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈనెల 6,7 తేదీలలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నిర్వహించిన అద్విక - 2019 పేపర్ ప్రెజెంటేషన్ లో ప్రధమ బహుమతి, టెక్ టాక్ లో ప్రథమ బహుమతి, అలాగే 13,14 తేదీలలో గైట్ ఇంజినీరింగ్ కళాశాల నిర్వహించిన "మేధా" లో పేపర్ ప్రెజెంటేషన్ లో ప్రథమ బహుమతి కైవసం చేసుకొన్నారని తెలిపారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, ట్రిపుల్ ఈ విభాగాధిపతి కె. మనోజ్ కుమార్ రెడ్డి, తదితరులు అభినందించారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us