ఏప్రిల్ 14న జాతీయ లోక్ అదాలత్

UPDATED 24th MARCH 2018 SATURDAY 5:00 PM

పెద్దాపురం: మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి  కె. రత్నకుమార్ శనివారం తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ  రెండవ శనివారం రోజున పెద్దాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, ఈ లోక్ అదాలత్ లో సెటిల్మెంట్ ఆఫ్ సివిల్, కాపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ-లిటిగేషన్, తదితర కేసులు పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో మూడు బెంచ్ లు ఉంటాయని, మొదటి బెంచ్ కు సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ ప్రిసైడింగ్ అధికారిగా, దేవేంద్ర కుమార్, ఆర్. విజయలక్ష్మి సభ్యులు న్యాయవాదులుగా, రెండవ బెంచ్ కు జూనియర్ సివిల్ జడ్జి ప్రిసైడింగ్ అధికారిగా, ఎ.వి. జనార్దన్, ఎం.సూర్యనారాయణ మూర్తి సభ్యులు న్యాయవాదులుగా, మూడవ బెంచ్ కు అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ప్రిసైడింగ్ అధికారిగా, ఎన్.వి.ఎస్. మూర్తి, ఎం.రాంబాబు న్యాయవాదులుగా ఉంటారని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు, న్యాయవాదులు, ప్రజలు వినియోగించుకోవాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి రత్నకుమార్ తెలిపారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us